Tgpvwa న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఫొటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేశారు. తెలంగాణ ఫోటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్రస్తుత కార్యవర్గ కాలపరిమితి ముగిసినందున నూతన కార్యవర్గమును ఎన్నుకొనుటకు ఎన్నికల తేది నిర్ణయించారు

ఎన్నికల ష్కేడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది

ఈ మాస అనగా ఏప్రిల్ 8, 9 తేదీలలో నామినేషన్ స్వీకరించబడును.ఏప్రిల్ 10వ తేది నామినేషన్ ఉపసంహరణ.
సమయం : ఉదయం 10 గం.ల నుండి సాయంత్రం 4 గం.ల వరకు
స్థలము : అసోసియేషన్ కార్యాలయం
ఆఫీస్ అడ్రస్ : ఇం.నెం. 16-11-20/1/1/ఎ, కిషన్ నివాస్, సలీమ్ నగర్ కాలనీ, మలక్ పేట్, హైదరాబాద్ – 500 036.
ఎన్నికల తేది : 22-4-2021.
సమయం : ఉదయం 8గం.ల నుండి సా. 4 గం.ల వరకు

ఎన్నికల నిబంధనలు :
1. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు తప్పనిసరిగా అసోసియేషన్ లో రెండు సంవత్సరములు శాశ్వత సభ్యత్వము కలిగియుండి, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గములో కాని, జిల్లా కార్యవర్గములో కాని రెండు సంవత్సరముల అనుభవం నామినేషన్ వేసే తేది నాటికి కలిగి వుండవలయును.

2. అధ్యక్షుడు, ప్రధానకార్యదర్శి, కోశాధికారి గా పోటీచేసే అభ్యర్థులు ఒకే ప్యానల్ గా మాత్రమే రావలయును.

3. నామినేషన్ వేయు ప్యానల్ డిపాజిట్ గా రూ. 20,000/- (నాన్ రిఫండబుల్) డి.డి. రూపంలో తెలంగాణ ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేర ఇవ్వవలయును.

4. నామినేషన్ నిర్ణీత సమయంలో ఉపసంహరణ చేసుకున్న వారికి 50% (పదివేల రూపాయలు) ఎన్నికల అనంతరం చెక్కు రూపంలో వాపసు ఇవ్వబడును.

5. ఎన్నికలలో సమాన ఓట్లు వచ్చిన యెడల టాస్ పద్ధతి ద్వారా విజేతను నిర్ణయించబడును.

6. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు ఎలాంటి నేర చరిత్ర కలిగి ఉండరాదు.

7. ఓటు హక్కు రాష్ట్ర అసోసియేషన్ లో శాశ్వత సభ్యత్వం కలిగిన వారికి మరియు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికార్లు మాత్రమే అర్హులు.

8. నామినేషన్ వేయుటకు, ఉపసంహరణకు, నిర్ణీత సమయంలో మాత్రమే స్వీకరించబడును.

9. ఓటు హక్కు వినియోగించువారు నిర్ణీత సమయంలో మాత్రమే వినియోగించుకోగలరు. (నిర్ణీత సమయంలో పోలీంగ్ బూత్ ఆవరణలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేయుటకు అనుమతించబడును.)

10. అసోసియేషన్ సంబంధించిన వ్యవహారములు ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గము మాత్రమే వివరిస్తారు. వీటిపై ఎన్నికల కమిటీ ఎలాంటి బాధ్యత వహించదు.

11. నామినేషన్ వేయువారు తప్పనిసరిగా అసోసియేషన్ ఐ.డి. కార్డుతో పాటు ఆధార్ కార్డు జతపరచవలయును.

12. నామినేషన్ వేయు అభ్యర్థిని ప్రతిపాదించేవారు, బలపర్చేవారు తప్పనిసరిగా అసోసియేషన్ ఐ.డి. కార్డు, ఆధార్ కార్డు జతపర్చవలయును.

13. కోవిడ్ నిబంధనల కారణంగా నామినేషన్ వేయు అభ్యర్థితో పాటు ప్రతిపాదించువారు, బలపరిచే వారిని మాత్రమే కార్యాలయ ఆవరణలోకి అనుమతించబడును.

14. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి వాదోపవాదములకు తావులేదు. ఎన్నికల కమిటిదే తుది నిర్ణయము.

15. రాష్ట్ర కార్యవర్గ తీర్మాణం ప్రకారం తేది 5-4-2021 నాటికి సభ్యత్వం పొందినవారికి మాత్రమే ఓటుహక్కు కల్పించబడినది

ఈ ఎన్నికలలో శాశ్వత సభ్యులు అందరు పాల్గోని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరారు

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *